హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడి యంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అండ్ అథారిటీ ఓఎస్డీ రవీందర్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. మొదటిరోజు అండర్-16, 18, 20 బాయ్స్ అండ్ గర్ల్స్‌కు డిస్కస్ త్రో, హైజంప్, 5000,10000 మీటర్ల రేస్‌వాక్, 800,1000 మీటర్ల పరుగు పందెం, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో పోటీలు నిర్వహించారు.
అథ్లెట్లు ప్రతిభ కనబర్చి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా వారికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టేన్లీ జోన్స్, కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి రాజేశ్‌కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు వరద రాజేశ్వర్‌రావు, మూగల కుమార్‌యాదవ్, డాక్టర్ మురళీధర్, పగ డాల వెంకటేశ్వర్‌రెడ్డి, వంశీరెడ్డి మెడల్స్ అందజేశారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడా కారులను ఈనెల 25 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించే జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తారు. కాగా, ఇటీవల చెన్నైలో జరిగిన ఎస్ఏఏఎఫ్ అథ్లెటిక్స్ గేమ్స్‌లో 800 మీటర్ల, 3000 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్మెడల్ సాధించిన బీ వినోద్‌కుమార్, మోహిత్చౌదరికి అథ్లెటిక్స్ అసోసియేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిస్కస్ త్రో : జీ సునిత్కుమార్(జనగామ, గోల్డ్ మెడల్), పీ గౌతమ్(కామారెడ్డి, సిల్వర్ మెడల్), జీ వరుణ్‌గౌడ్(నిర్మల్, బ్రోంజ్ మెడల్)
హైజంప్ : జీ వినయ్(భద్రాద్రి, గోల్డ్), పీ వెంకటేశ్వర్రావు(భద్రాది, సిల్వర్), బీ విష్ణు(మంచిర్యాల, బ్రోంజ్)
5000 మీటర్స్ రేస్‌వాక్ : ఎడ్ల సాయిచరణ్‌రెడ్డి(నిజామాబాద్, గోల్డ్), అట్టమ్ జశ్వంత్(ఆదిలాబాద్, సిల్వర్), దూరిశెట్టి చంద్రసిద్ధార్థ(ఆదిలాబాద్, బ్రోంజ్) అండర్-20 బాయ్స్
800 మీటర్ల పరుగుపందెం : ఎం ఈశ్వర్(కామారెడ్డి, గోల్డ్), శీలం గోపీచంద్(ఖమ్మం, సిల్వర్), ఎం అఖిల్(భద్రాది, బ్రోంజ్)
షాట్‌పుట్ : ఏ సాయికిరణ్(వికారాబాద్, గోల్డ్), ఎస్ విదిత్రెడ్డి(హైదరాబాద్, సిల్వర్), ఎస్కే ఆఫ్తాబ్(ఖమ్మం, బ్రోంజ్)
డిస్కస్ త్రో : ఎస్ విదిత్రెడ్డి(హైదరాబాద్, గోల్డ్), కే స్వామి(కరీంనగర్, సిల్వర్), కోల రాహుల్(హైదరాబాద్, బ్రోంజ్)
హై జంప్ : ఎం పవన్(భద్రాద్రి, గోల్డ్), బీకే శ్రీరాం(రంగారెడ్డి, సిల్వర్), బీ గణేశ్(భద్రాది, బ్రోంజ్)
10000 మీటర్ల రేస్‌వాక్ : ఈ విష్ణువర్ధన్(కరీంనగర్, గోల్డ్), ఎండీ సోహైల్(జగిత్యాల, సిల్వర్), పీ అబ్దుల్కరీంబాషా(జోగులాంబ గద్వాల్, బ్రోంజ్)
లాంగ్‌జంప్ : బీ అంజి(హనుమకొండ, గోల్డ్), నాగనాథ్(నిజామాబాద్, సిల్వర్), బొళ్ల బన్నీ(వనపర్తి, బ్రోంజ్)
అండర్-18 గర్ల్స్..
షాట్‌పుట్ : కే రాజరాజేశ్వరి(నాగర్‌కర్నూల్, గోల్డ్), జీ సిరిరెడ్డి(రంగారెడ్డి, సిల్వర్), ఎం అక్షయసింధు(జనగామ, బ్రోంజ్)
1000 మీటర్ల పరుగుపందెం : ఏ అఖిల(నల్లగొండ, గోల్డ్), కే స్వప్న(నాగర్‌కర్నూల్, సిల్వర్), ఎం గౌరీప్రియ (రంగారెడ్డి, బ్రోంజ్)
జావెలిన్‌త్రో : ఎన్ శ్రీకాంత్(మెదక్, గోల్డ్), ఆర్ వంశీ(ఆసిఫాబాద్, సిల్వర్), పీ సతీశ్‌కుమార్ (ఆదిలాబాద్, బ్రోంజ్)
లాంగ్‌జంప్ : జీ రాజేశ్(రంగారెడ్డి, గోల్డ్), కే ఉదయ్‌కిరణ్(నాగర్‌కర్నూల్, సిల్వర్), కే ఆనంద్(కామారెడ్డి, బ్రోంజ్)
షాట్‌పుట్ : ఎస్కే అమ్రీన్(భద్రాద్రి, గోల్డ్), ఎం అనిగౌడ్(మేడ్చల్, సిల్వర్), కే రేవతి(వికారాబాద్, బ్రోంజ్)
800 మీటర్ల పరుగుపందెం : డీ కల్యాణి(సూర్యాపేట, గోల్డ్), ఎం టబు(భద్రాద్రి, సిల్వర్), జీ ఉషారాణి(జోగులాంబ గద్వాల్, బ్రోంజ్)
షాట్‌పుట్ : ఎన్ బుచ్చమ్మ(నాగర్‌కర్నూల్, గోల్డ్), సీ వసంత(ఆదిలాబాద్, సిల్వర్), ఏ లక్ష్మీప్రసన్న(హనుమకొండ, బ్రోంజ్)
200 మీటర్ల పరుగుపందెం : ఎన్ ప్రవళిక(నల్లగొండ, గోల్డ్), ఎం శ్రీనివాస్(రంగారెడ్డి, సిల్వర్), మాల శృతి(నాగర్‌కర్నూల్, బ్రోంజ్).