హనుమకొండ (ఐనవోలు) : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు విషయం బోధపడి తిరిగి ఇంటి పార్టీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ వారి అనుచరులతో కలిసి మంగళవారం మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత మాటలు మోసపోయామని ప్రజలు అంటున్నారు. కేసీఆర్ ఓ విజన్‌తో పని చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నదని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తాయన్నారు. పార్టీలో చేరిన వారిలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు, ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఉన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు, మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, మరుపట్ల దేవదాస్, దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.