హనుమకొండ చౌరస్తా, మే 21: భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం(ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఫిజిక్స్విభాగం సహాయ ఆచార్యులు లాదల జితేందర్, డాక్టర్ ఆలేటి సరితలను నియమిస్తూ ఇస్రో చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారని ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకర జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి ఇరువురిని అభినందించారు.
ఇస్రో ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం ముఖ్యంగా విద్యార్థులు పరిశోధనల పట్ల అవగాహన పెంపొందించేదిశగా పనిచేస్తారని, ప్రస్తుతం ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మకమైన పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు వీరు ఇరువురు పనిచేస్తారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. జితేందర్, సరితలను కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.