తాత, కొడుకు, మనుమడి మృతదేహాలకు దహన సంస్కారాలు
బాధిత కుటుంబాలకు రూ.25వేలు అందించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట రూరల్, మార్చి 14 : దుగ్గొండి మం డలం రంగాపురం గ్రామ శివారులోని రాళ్లకుంట చెరువులో పడి మృత్యువాత పడిన నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన తాత, కొడుకు, మనుమడి మృతదేహాలకు సోమవారం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. వెంగలదాసు కృష్ణమూర్తి, కుమారుడు నాగరాజు, మనుమడు దీపక్‌కు కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేశారు. మృతుల కుటుంబాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది రూ.25వేలు అందించారు. పరామర్శించిన వారిలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామా ల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, ఉపాధ్యక్షుడు అల్లి రవి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు భూక్యా వీరన్న, చిన్న గురిజాల, గురిజాల, గుం టూరుపల్లి, జీజీఆర్‌పల్లి గ్రామాల సర్పంచ్‌లు గడ్డం సుజాత, గొడిశాల మమత, కర్నాటి పార్వతమ్మ, తుత్తూరు కోమల, ఎంపీటీసీ బండారు శ్రీలత, న్యాయవాది మోటూరి రవి, గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్, నాయకులు నాయకులు మో తె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, అల్లి రవి, బండారి రమేశ్, గడ్డం రాజు, తుత్తూరు రమేశ్, రాజు, రమేశ్, నాగిశెట్టి కొమురయ్య, పోతు శంకర్, పుప్పాల భీమయ్య, చంద యాదగిరి, పుప్పాల మధు తదితరులు ఉన్నారు.