కొత్తగూడెం సింగరేణి, జనవరి 6:మహిళలకు పెండ్లి తర్వాతా ఓ జీవితం ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకుంటే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. ఇందులో కుటుంబ సభ్యుల పా్ర త ఎంతో కీలకం. శిల్ప కళాకారిణిగా తన అడుగుల్లో వారే కీలకమ ని, చాలా మంది వారించినా పట్టుదల, కృషి తనను ఈ స్థానం లో నిలి పిందని ప్రముఖ శిల్పి స్నేహలతా ప్రసాద్ స్పష్టం చేశారు. తొలిసారిగా సింగరేణి ప్రాంతంలో నిర్వహించిన శిల్పోత్సవానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించిన ఆమె.. ఇక్కడి ఆతిథ్యాన్ని మర్చిపోనని ‘నమస్తే’కు తన మనోగతాన్ని వెల్లడించారు.
నమస్తే: మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం గురించి చెప్తారా..?
స్నేహలతా ప్రసాద్ : మాది రాజస్థాన్. అక్కడే చదువుకున్నా. చిన్ననాటి నుంచి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అమ్మానాన్నలు ఈ విషయంలో ఎంతో ప్రోత్సహించారు. శిల్పకళాకారిణిగా పేరు పొందానంటే వారి కృషి ఎంతో ఉంది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రసాద్ పత్రితో 2004లో వివాహం జరిగింది. మా ఆయన హైదరాబాద్‌లో శివనందిని దవాఖాన నిర్వహిస్తున్నారు. మాకు కొడుకు భగీరథ్(ఇంటర్), కుమార్తె శివనందిని (9వ తరగతి) ఉన్నారు.
నమస్తే : పెళ్లాయ్యాక కూడా ఈ శిల్పకళను ఎలా కొనసాగిస్తున్నారు..?
స్నేహలతా ప్రసాద్ :చాలా మంది పెళ్లయ్యాక వంటింటికే జీవితం పరిమితం అనుకుంటారు. భర్త, పిల్లలు, కు టుంబమే జీవితమంటూ రాజీ పడుతున్నా రు. పెళ్లి తరువాత కూడా లక్ష్యాన్ని చేరుకోగల ననే ఆకాంక్షతో ముందుకు సాగాలి. పెళ్లయ్యా క కొన్ని రోజులు పిల్లలు, వారి చదువులపై దృ ష్టి పెట్టా. 2011లో తిరిగి కళారంగం వైపు మళ్లా. నా భర్త, మిగతా కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారు..
నమస్తే : శిల్పకళాకారిణిగా మీ ప్రయాణం ఎలా ఉంది..?
స్నేహలతా ప్రసాద్ : తొలుత మహిళలు శిల్పాలు చేయడం ఏంట ని చాలామంది నిరుత్సాహ పర్చారు. అయినప్పటికీ పట్టుదల, కృషితో ముందుకు వెళ్లా. ఢిల్లీ, సిమ్లా, హర్యానా, నాగ్‌పూర్ ప్రాంతాలతో పాటు దుబాయ్, సింగపూర్, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చా. సింగపూర్, దుబాయ్‌లో నిర్వహించిన వరల్డ్ ఆర్ట్ గ్యాలరీలో పాల్గొని భారతీయ చిత్ర, శిల్ప కళలను ప్రదర్శించాం. వేస్ట్ మెటీరియల్‌తో కూడా అనేక కళాఖండాలను తయారు చేశాం.
నమస్తే : శిల్పకళకు, విగ్రహాల తయారీకి తేడా ఏంటి?
స్నేహలతా ప్రసాద్ :సిమెంట్, ఫైబర్‌తో తయారు చేసిన విగ్రహాలకు మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. రోజులు గడిచే కొద్ది బలహీనంగా తయారవుతాయి. శిలల ద్వారా తయారు చేసిన వి గ్రహాలకు మెయింటనెన్స్ తగ్గుతుంది. కాలం గడిచే కొద్ది శిల్పాలు ప్రత్యేక ఆకర్షణతో అద్భుతంగా తయారవుతాయి.
నమస్తే : సింగరేణి నిర్వహించిన శిల్పోత్సవం ఎలా అనిపించింది.
స్నేహలతా ప్రసాద్ :రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కొత్తగూ డెం సీఈఆర్ క్లబ్లో శిల్పోత్సవాన్ని నిర్వ హించారు. పది మంది కళాకారులం రోజుకు 15 గంటలు కష్టపడ్డాం. సింగరేణి సంస్థ ఆతిథ్యం, ప్రోత్సాహాన్ని మర్చిపోలేం. చాలా సం తోషంగా, సంతృప్తిగా అనిపించింది.
నమస్తే : ఆర్ట్ గ్యాలరీ నుంచి చిత్రకళాకారిణిగా మీ అడుగులు ఎలా..?
స్నేహలతా ప్రసాద్ :హైదరాబాద్‌లోని లలిత కళా అకాడమీలో ఒ క గ్యాలరీని ఎంపిక చేసుకున్నా. ఆ గ్యాలరీ ద్వారా అనేక చిత్ర కళా ప్రదర్శనలు ఇచ్చా. ఆర్ట్ గ్యాలరీ ద్వారా ఎన్నో ప్రశంసలు పొందా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించే అవకాశం దక్కింది. సిమ్లా లో ఆర్ట్ గ్యాలరీ నిర్వహించినప్పుడు పక్కనే శిల్పకళా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనే నన్ను ఇటువైపు నడిపించింది. ఆ తర్వాత శిల్పాలు చెక్కడంలో శిక్షణ పొందా.