జయశంకర్ భూపాలపల్లి : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. బడ్జెట్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు.
మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి , వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.