జయశంకర్ భూపాలపల్లి, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై జీలుగ విత్తనాలు అందిస్తున్నది. విత్తనాల అసలు ధర కిలో రూ.53.50 ఉండగా 65 శాత రాయితీతో రైతులకు వ్యవసాయ శాఖ కేవలం రూ.18.72లకు మాత్రమే అందిస్తున్నది. జిల్లాలో ప్రస్తుతం 1250.10 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్ వెల్లడించారు. జిల్లాలో ఎనిమిది కేంద్రాల ద్వారా వీటిరి రైతులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు..
జీలుగ విత్తనాలు రాయితీపై పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్‌తో స్థానిక వ్యవసాయ అధికారి వద్ద ఆన్లైన్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ఇచ్చే ఆన్లైన్ పర్మిట్‌తో రాయితీపై విత్తనాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
విక్రయ కేంద్రాలు..
మన గ్రోమోర్ సెంటర్, చెల్పూర్, గణపురం మండలం 100 క్వింటాళ్లు
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం గణపురంలో 149 క్వింటాళ్లు
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం రేగొండలో 250 క్వింటాళ్లు
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం చిట్యాల 150 క్వింటాళ్లు
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం నైన్పాక, చిట్యాల మండలం 100 క్వింటాళ్లు,
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం మొగుళ్లపల్లి మండలం 250 క్వింటాళ్లు
మన గ్రోమోర్ సెంటర్, మహదేవపూర్ మండలం 100 క్వింటాళ్లు
మన గ్రోమోర్ సెంటర్, కాటారం 150 క్వింటాళ్లు