ఖానాపురం, మే 28 : కరోనా మహమ్మారిని మనోధైర్యంతోనే ఎదుర్కోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన దాత గోనుగుంట్ల పెద్దారావు మండలంలోని 135 మంది కరోనా బాధితులకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరుకులను శుక్రవారం అందించగా ఆదర్శ యూత్ సహకారంతో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామస్వామినాయక్ మా ట్లాడుతూ దాత గోనుగుంట్ల పెద్దారావు హైదరాబాద్‌లో స్థిరపడినా మండల ప్రజలపై మమకారంతో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు. కరోనా బాధితులకు ఆదుకునేందుకు దాతలు ముం దుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్, ఎస్సై సాయిబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, సర్పంచ్‌లు శాఖమూరి చిరంజీవి, హరిబాబు, కాస ప్రవీణ్‌కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఎస్కే మౌలానా, ఎంపీటీసీలు మర్రి కవిత, భారతి, ఆదర్శ యూత్ బాధ్యులు దాసరి రమేశ్, గంగాపురం రాజు, మచ్చిక శ్రీకాంత్, రాజ్‌కుమార్, భరత్, భిక్షపతి, అనిల్, రాజేందర్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్లో..
నర్సంపేట రూరల్ : మండలంలోని చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, భాంజీపేట, మాధన్నపేట, నాగుర్లపల్లి గ్రామా ల్లో కరోనా బాధితులను ఎంపీడీవో నాగేశ్వర్రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పరామర్శించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. తీవ్రత ఉన్నవారు నర్సంపేట ఏరియా దవాఖానలో చేరి చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు బరిగెల లావణ్య, బొజ్జ యువరాజ్, పలకల పూలమ్మ, మొలుగూరి చంద్రమౌళి, కందికొండ రజిత, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.