జయశంకర్ భూపాలపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
..మహిళల సాధకారతే లక్ష్యంగాసీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మార్చి 6,7,8 తేదీలలో ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు ఘనంగా నిర్వహించాలన్నారు. తెలంగాణలో మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.