వనదేవతల భూమికి ఫెన్సింగ్..
ఆలయానికి 28 ఎకరాల భూమి కేటాయింపు
ప్రహరీ నిర్మాణానికి రూ. కోటి మంజూరు
తాడ్వాయి, డిసెంబర్22: మేడారంలో అభివృద్ధి పనులు షురువవుతున్నాయి. వనదేవతలకు కేటాయించిన భూమి రక్ష ణకు బుధవారం దేవాదాయ శాఖ అధికారులు ఫెన్సింగ్ ఏర్పా టు పనులను ప్రారంభించారు. సమ్మక్క దేవతను తీసుకువచ్చే ముందు కంకవనాన్ని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తామని, ఇతర కార్యక్రమాల కోసం స్థలం కావాలని గత జాతరలో పూజారు లు కోరారు. దీంతో అప్పటి కలెక్టర్ రెడ్డిగూడెం సమీపంలో గు ట్టపై 28 ఎకరాల 37 గుంటల స్థలాన్ని వనదేవతల దేవాలయా నికి కేటాయించారు. ఇటీవల విడుదలైన మహాజాతర నిధుల్లో సు మారు రూ. కోటి మంజూరు కాగా, భూమి చుట్టూ ఫెన్సింగ్ తో పాటు రెండు షెడ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ఆర్టీసీ క్యూలైన్లు..
సమ్మక్క-సారలమ్మల మహాజాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మేడారంలోని ఆర్టీసీ బ స్టాండ్‌లో క్యూలైన్ల నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమ య్యాయి. ప్రయాణికులు తిరుగి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల ను ఎక్కేందుకు వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
టెంటెడ్ హౌస్‌లు సిద్ధం
మేడారం మహా జాతరను పురస్కరించుకుని అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులతో తాత్కాలిక టెంటెడ్ హౌస్‌లు సిద్ధమవుతున్నాయి. హరిత హోటల్ నిర్వా హకులు భక్తుల కోసం ఈసారి ముందస్తుగానే అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు. హోటల్ ఆవరణలో సుమా రు 20 వరకు టెంటెడ్ హౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు లో అటాచ్డ్ టాయిలెట్‌తోపాటు వాష్ రూమ్, కూర్చునేందు కు సోఫాలు, కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఇవి భక్తులకు అందుబాటులోకి రానున్నాయని నిర్వా హకులు తెలిపారు. రెంట్ కూడా అన్ని వర్గాల వారికి అందు బాటులో ఉంటాయని చెప్పారు.
సారలమ్మ గుడి సుందరీకరణ..
కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ దేవత గుడి సుందరీకరణ పనులను పూజారులు, మేడారం జాతర ఈవో రాజేంద్రం ప్రారంభించారు. మహా జాతర సందర్భంగా రూ. 40 లక్షలు మం జూరు కావడంతో, వీటితో గుడి చుట్టూ ప్రహరీకి సాలహారం నిర్మా ణంతో పాటు గుడి, ప్రహరీకి రంగులు వేయను న్నారు.
మేడారంలో భక్తుల సందడి
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిం చి తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజుల గద్దెలకు పసుపు, కుంకు మ చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొ క్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోర్కె లు తీర్చు తల్లీ.. అంటూ భక్తులు యాట పోతులు, కోళ్లను సమ ర్పించి జాతర పరి సరాల్లో వంటలు చేసుకుని విందు భోజ నాలు చేస్తున్నారు. మళ్లీ వస్తాం తల్లీ.. అంటూ వారి స్వగ్రామాలకు తిరుగు ప్ర యాణం అవుతున్నారు.
తల్లులను దర్శించుకున్నఝార్ఖండ్ మాజీ మంత్రి
వనదేవతలను ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి గీతా శ్రీ ఓరం దర్శించుకున్నారు. ఆమెకు పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం ప లికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వ హించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వెంట టీడబ్ల్యూ టీయూ రాష్ట్ర గౌరవ సలహాదారు పొదెం క్రిష్ణప్రసాద్ ఉన్నారు.