మహాదేవపూర్, జూన్ 11: విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం జిల్లా అధ్యక్షులు ఆకునూరి సతీశ్ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని, విశ్వ బ్రాహ్మణుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారులకు, వడ్రంగులకు, పోలీసువారితో, ఫారెస్ట్అధికారులతో ఇబ్బందులున్నాయని గుర్తు చేశారు. కుల వృత్తులు రోజు రోజుకు నిరాదరణకు గురి కావడంతో విశ్వకర్మలు దిక్కు తోచని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తుల లేక బతుకులు భారమై కుటుంబాలను నెట్టుకొస్తున్న విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 50 సంవత్సరాలు నిండినవారికి రూ5 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 20ఎకరాల స్థలం కేటాయించి, వృత్తి శిక్షణ, వృత్తి చేసుకోవడానికి చిన్నతరహా పరిశ్రమల రూపంలో పంచవృత్తులు ఒకే చోట నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.