ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
రూ.90 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వెంకటాపురం, వాజేడులో సుడిగాలి పర్యటన
వెంకటాపురం(నూగూరు)/ వాజేడు, డిసెంబర్ 29 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో బుధవారం వారు పర్యటించారు. ఎమ్మెల్సీ నిధుల్లోంచి రూ. 90 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం వారి జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే గ్రామ గ్రామానికి, వీధి వీధికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో వారు పర్యటించారు. ఎమ్మెల్సీ నిధులు రూ. 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదట మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల అదనపు గదులకు, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఓట్ల సమయంలో మాత్రమే గిరిజన గూడేలకు వచ్చి తర్వాత ముఖం చాటేసేవని దుయ్యబట్టారు. కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాలతో పాటు గిరిజన గూడేలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. గ్రామగ్రామానికి సీసీ రోడ్లు వేయిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే తెలిపారు. అనంతరం వేల్పూరి శ్రీనివాస్‌కు మంజూరైన రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును వారు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, నూగూరు ఏఎంసీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ రమణయ్య, వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్ చిడెం యామిలి, టీఆర్ఎస్ వెంకటాపురం, వాజేడు మండలాల అధ్యక్షులు గంపా రాంబాబు, పెనుమళ్ల కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి పిల్లారశెట్టి మురళి, వెంకటాపురం టౌన్ అధ్యక్షుడు చిడెం నగేశ్, అధికార ప్రతినిధి డర్రా దామోదర్, సోషల్ మీడియా ఇన్చార్జి అడబాల నాగేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాందార్ల నాగేశ్వరావు, బాలసాని శ్రీను, మధు, అచ్చ నాగేశ్వర్రావు, జాగర శాంతమూర్తి, శివాజీ, మద్దుకూరి ప్రసాద్, ములకల ఐలయ్య, తోట శ్రీను, సర్పంచ్‌లు, పూజారి ఆదిలక్ష్మి, పూనెం శ్రీదేవి, అట్టం సత్యవతి పాల్గొన్నారు.
వాజేడులో హైస్కూల్ ప్రహరీ నిర్మాణానికి…
వాజేడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రహరీ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ నిధులు రూ.20 లక్షలతో ప్రహరీ, ఆరుగుంటపల్లిలో రూ. 5లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.