నియోజకవర్గాన్ని నాబార్డు దత్తత తీసుకోవాలి
కేంద్రం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
కొండైల్పల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం ప్రారంభం
నల్లబెల్లి, డిసెంబర్ 29: ఎఫ్‌పీవో(ఫార్మర్ ప్రొ డ్యూసర్ ఆర్గనైజేషన్)లతో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండైల్పల్లె గ్రామంలో 200ల మంది రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనా న్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎఫ్‌పీవోల ఏర్పాటు తో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టి సైడ్ల్లో ఎలాంటి మోసాలకు గురికాకుండా స్వ యంప్రతిపత్తితో ముందుకు సాగవచ్చని అన్నారు. నియోజకవర్గంలో 36 వేల మంది రైతులతో 99 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటయ్యాయని, ఇం దులో ఇప్పటికే 36 ఎఫ్‌పీవోలు వ్యాపారం మొద లుపెట్టి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా ఎలాంటి ట్యాక్స్ లేకుం డా ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవ చ్చన్నారు. పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమై న నర్సంపేట నియోజకవర్గాన్ని నాబార్డు దత్తత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామి నాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుం డా కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమ ర్శించారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతు ఉత్పతి సంఘాలకు సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉన్నందున ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ, సర్పంచ్, ఎఫ్‌పీవో అధ్యక్షుడు మామిండ్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎద్దు రవి, కోఆప్షన్ మెంబర్ నజీమా, ఏఈవో శ్రీకాంత్, సీఏ కొ లగాని రామారావు, డైరెక్టర్లు కొనకటి వీరమల్లు, గోనె వీరస్వామి, ఊర టి నగేశ్, లింగారెడ్డి, రాజు, శ్రీని వాస్, రజినీకాంత్ పాల్గొన్నారు.