మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్(సీఈ) శ్రీనివాస్‌రావు
నాచినపల్లిలో నల్లాల పరిశీలన
దుగ్గొండి, డిసెంబర్ 28 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరందించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్(సీఈ) శ్రీనివాస్‌రావు తెలిపారు. సీఎం వో అధికారి స్మితా సబర్వాల్ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలో పర్యటించారు. మం డల పరిషత్ కార్యాలయంలో గుత్తేదారులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని గ్రామాల్లో తాగునీరు అందడం లేదని ఆరోపణలు వచ్చాయన్నా రు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. నాచినపల్లి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రతి నల్లాను పరిశీలించారు. వారం రోజుల్లో ప్రతి ఇంటికీ నీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా నాచినపల్లి..
మిషన్ భగీరథ పథకాన్ని వందశాతం సద్వినియోగం చేసుకునేలా నాచినపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పైపు లైన్లు, నల్లాలకు మరమ్మతులు చేసి, వాటర్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు ప్రతి ఇంటికీ తాగు నీరందిస్తామని సీఈ అన్నారు. నిర్లక్ష్యం చేసే అధికారులను సస్పండ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమల, సర్పంచ్ పెండ్యాల మమత, డీఈ ప్రదీప్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, మిషన్ భగీరథ ఏఈలు రాజ్‌కుమార్ సతీశ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.