IND vs PAK | టాస్ పడింది.. కానీ, షేక్ హ్యాండ్ లేదు..!
IND vs PAK : లీగ్ దశలో చెరో రెండు విజయాలతో జోరుమీదున్న ఇరుజట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బిగ్ ఫైట్ జరుగనుంది. టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs PAK : క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాసేపట్లో మొదలవ్వనుంది. లీగ్ దశలో చెరో రెండు విజయాలతో జోరుమీదున్న ఇరుజట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బిగ్ ఫైట్ జరుగనుంది. టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా (Salman Agha) బౌలింగ్ తీసుకున్నాడు. అయితే.. ఆసియా కప్ ఒరవడిని ఈ మెగా టోర్నీలోనూ కొనసాగించిన ఇరుజట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
భారత జట్టుతో ఆడుతామని పాక్ బోర్డు చెప్పినప్పటి నుంచి ‘టాస్ వేళ షేక్ హ్యాండ్ ఉంటుందా?’ అని అందరూ ఆసక్తి కనబరిచారు. కానీ ‘ఆట ఆటే.. పంతం పంతమే’ అని చాటుతూ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాత్రం సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపలేదు. టాస్ సమయంలో ఇద్దరూ కాస్త ముఖం చిట్లించినట్టుగానే కనిపించారు. పాక్ సారథి టాస్ గెలిచి హేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, భారత కెప్టెన్ వెనక్కి జరిగి.. పక్కకు వచ్చేశాడు. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సల్మాన్ మాట్లాడడం పూర్తవ్వగానేన సూర్య అతడివైపు చూడకుండానే కామెంటేటర్ వద్దకు వచ్చాడు.దాంతో.. షేక్ హ్యాండ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Pakistan are unchanged; Abhishek Sharma is back while Kuldeep comes in for Arshdeep 🔁
LIVE 👉 https://t.co/1yhhOmNa9u pic.twitter.com/2hwaJ9R7M6
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2026
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే. రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ తుది జట్టు : సయీం ఆయూబ్, సహిబ్జద ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజాం, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీం అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారీఖ్.
లీగ్ దశలో రెండేసి విజయాలతో భారత్, పాక్ జట్లు గ్రూప్ ఏ నుంచి ఒకటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడో విజయంతో సూపర్-8 బెర్తు పట్టేసేందుకు ఇరుజట్లు హోరాహోరీగా తలపడడం ఖాయమనిపిస్తోంది. ఈ మధ్యే ఆసియా కప్‌లో కంగుతిన్న పాక్ దెబ్బతిన్న పులిలా ప్రతీకారం కోసం చూస్తోంది. కానీ.. పొట్టి ఫార్మాట్లో అజేయ శక్తిగా దూసుకెళ్తున్న టీమిండియా జోరును అడ్డుకోవడం ఆ జట్టుకు శక్తికి మించిన పనే. పైగా.. ఒకప్పటిలా పాక్‌తో గ్రైటెస్ట్ రైవర్లీ లేదు. గత ఐదు మ్యాచుల్లో భారత జట్టే గెలుపొందడమే అందుకు ఉదాహరణ.
Suryakumar Yadav Was Bowling Like Usman Tariq Against Rinku Singh 😂 pic.twitter.com/oIINgAdtLr
— Koushik (@koushikkkrian) February 14, 2026
అయితే.. ఈసారి ఆ జట్టులో ఉస్మాన్ తారీఖ్ అనే వింతైన బౌలర్ ఉన్నాడు. చక్లింగ్ యాక్షన్.. బ్యాటర్లను తికమకపెట్టే విధంగా బంతిని విసురుతూ .. వికెట్లు పడగొడుతున్న అతడు పాక్ బలం కానున్నాడు. సిలబస్‌లో లేని ప్రశ్నను సైతం ఎదుర్కొనేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని మీడియా సమావేశంలో నెట్స్‌లో గట్టిగానే సాధన చేశారు. తొలి బంతి నుంచే విరుచుకుపడే ఓపెనర్ అభిషేక్ శర్మ రాక పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రెఢీ అయ్యాడు. అస్వస్థత కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన ఈ డాషింగ్ బ్యాటర్.. నెట్స్‌లో సాధన చేశాడు. అతడి రాకతో భారత బ్యాటింగ్ యూనిట్ దుర్బేధ్యంగా మారింది. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడాలనుకుంటున్నట్టు చెప్పిన సూర్య.. కుల్దీప్ యాదవ్ ఆడడంపై స్పష్టతనిచ్చాడు. అదే జరిగితే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కే పరిమితం కాగా.. బుమ్రాకు తోడుగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబేలు పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

