పాలకుర్తి, డిసెంబర్ 26 : నమ్ముకున్న ప్రజల కష్టసుఖాలలో వెన్నంటి ఉండే ప్రజానాయకుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆదివారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పస్నూరి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి సోమేశ్వరలక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీఫ్లోర్‌లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వీరమనేని యాకాంతరావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, నోముల సతీశ్, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, సింగారపు దీపక్, కమ్మగాని నాగన్న, గజ్జి సంతోష్‌కుమార్, పసుల వెంటేశ్, జోగు గోపి, కెశబోయిన సాయి, వెంకన్న పాల్గొన్నారు.
మంత్రి కోలుకోవాలని మస్తీద్లో ప్రత్యేక ప్రార్థనలు..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆదివారం మండలకేంద్రంలో జమామస్తీద్లో ప్రత్యేక నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పస్నూరి నవీన్‌కుమార్ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు వహిద్, చెన్నూరు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎండీ నాసర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ అబ్బాస్‌అలీ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో..
దేవరుప్పుల: మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా నుంచి కోలు కోవాలని ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు శివాలయంలో మంత్రి త్వరగా కోలుకోవాలని 108 బిందెల నీళ్లలో శివాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. అర్చకుడు మూటకోడూరు శ్రీనివాస శర్మ మంత్రి దయాకర్‌రావు పేర అర్చన చేశారు. అనంతరం 108 కొ బ్బరి కాయలకు కొట్టి శివుడికి భక్తి శ్రద్ధ్దలతో పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తీగల దయాకర్, మండల నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరగగా, టీఆర్ఎస్ శ్రేణులు ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో మంత్రి దయాకర్‌రావును కరోనా నుంచి విముక్తున్ని చేయాలని దేవున్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఈదునూరి న ర్సింహరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ కారుపోతుల భిక్షపతి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, మాజీ ఎం పీపీ కొల్లూరు సోమయ్య, పార్టీ మండల ప్రధానకార్యదర్శి చింత రవి, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు పందినబోయిన మధుముదిరాజ్, దేవరుప్పుల టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లొడంగా వెంకన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అనంతోజు కృష్ణమూర్తి, డైరెక్టర్ జోగు సోమనర్సయ్య, యూత్ జిల్లా నాయకులు కోతి ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ కొత్త జలెందర్‌రెడ్డి, పాలకుర్తి దేవస్థాన కమిటీ డైరెక్టర్ తీగల సత్తయ్య, పార్టీ అధికార ప్రతినిధి సుడిగెల హనుమంతు, ధరావత్‌తండా సర్పంచ్ బానోత్ గేమానాయక్, మండల నాయకులు ఆలకుంట్ల యాదగిరి, గోలి ఉప్పల్‌రెడ్డి, శీల తిరుమలేశ్, దాట్ల యాకయ్య, కారుపోతుల యాదగిరి, వంగ అర్జున్, కాడబోయిన యాదయ్య, యూ త్ నాయకులు కాముని నర్సింహస్వామి, భరత్, ముదిరాజ్ సంఘం మండల నాయకుడు నర్ర సోమశేఖర్, చింత పరుశరాములు, జోగు ఐలమల్లు ఉన్నారు.