ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
చెన్నారావుపేట/దుగ్గొండి, డిసెంబర్ 25: పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. చెన్నారావుపేటకు చెందిన మహ్మద్ కుర్బాన్ కుమారుడు నబీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో అతడికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎమ్మెల్యే రూ. 3.50 లక్షల విలువైన ఎల్వోసీని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కుర్బాన్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, జోజిపేట సర్పంచ్ అండృ విజయాబాలజోజీ, టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి, పార్టీ చెన్నారావుపేట గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, వార్డు సభ్యులు శ్రీధర్‌రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. అలాగే, దుగ్గొండి మండలం పొనకల్‌కు చెందిన ముత్యాల బుచ్చయ్యకు ఎమ్మెల్యే పెద్ది సహకారంతో పొనకల్ సర్పంచ్ బొమ్మగాని ఉర్మిళావెంకన్న ఆధ్వర్యంలో రూ. 2.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ జగన్నాథం, రాజేశ్వర్‌రావు, సంజీవరావు, మోహన్‌రావు, బాబురావు, శ్రావణ్ పాల్గొన్నారు.
ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలి
నర్సంపేట: ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. క్రిస్మస్ను పురస్కరించుకొని నర్సంపేటలోని సీఎస్ఐ, గాంధీబొమ్మ ప్రాంతంలోని చర్చిల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్‌లు కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏసుక్రీస్తు అందరికీ మార్గదర్శకుడన్నారు. ఏసుక్రీస్తు బోధనలు చాలా గొప్పవన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను గౌరవిస్తున్నదన్నారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగలు జరుపుకోవాలని కానుకలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, ఏఎంఐ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పెద్ది పరామర్శ
నర్సంపేటరూరల్/నల్లబెల్లి: నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లెలో శతాధిక వృద్ధురాలు గండ్రకోట కనుకవ్వ శనివారం మృతి చెందింది. ఎమ్మెల్యే పెద్ది బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనుకవ్వ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉన్నారు. నల్లబెల్లిలో ముత్యాల క్రిష్ణయ్య(60) మృతి చెందాడు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి క్రిష్ణయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ సునీతాప్రవీణ్, సర్పంచ్ ఎన్ రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావ్, మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు, నాయకులు గుమ్మడి వేణు, ఆకుల సాంబరావు పాల్గొన్నారు.