త్వరలో మొండ్రాయి, పల్లార్గూడలో రోడ్డు విస్తరణ
ఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, డిసెంబర్ 25 : గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. మండలంలోని మొండ్రాయి, పల్లార్గూడ గ్రామాల్లో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. మెజారిటీ ప్రజల అభీష్టంతోనే మాచ్చాపూర్ నుంచి చెన్నారావుపేట వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాల్లో మార్పులు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 182 కుటుంబాలకు ఇండ్లు నిర్మించామన్నారు. ఇండ్లు కోల్పోతున్న వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, కందకట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, తహసీల్దార్ రాజేంద్రనాథ్, సర్పంచ్‌లు గూడ కుమారస్వామి, ఇజ్జగిరి స్వప్న, మేరుగు మల్లేశం, కక్కెర్ల కుమారస్వామి, బిచ్చానాయక్, ఎంపీటీసీలు కొనకటి రాణి, గుగులోత్ వీరమ్మ, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, మాజీ ఎంపీపీ వీరాచారి, మాజీ ఎంపీటీసీ కడ్దూరి సంపత్, గండ్రకోటి రవి, చంద్రమౌళి, రాజు, బాబు కొమ్మాలు, అనుముల ప్రతాప్, పెండ్లి కుమారస్వామి, ఇజ్జగిరి అశోక్, పెండ్లి పురుషోత్తం, దుడ్డె ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే, మొండ్రాయి గ్రామంలో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే చల్లా పరామర్శించారు. కొనకటి మొగిలి, ఇండ్ల రవి తదితరులు ఉన్నారు.