స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 25 : యేసు చూపిన శాంతిమార్గంలో అందరూ పయనించాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండల కేంద్రంలోని ఆర్సీఎం చర్చిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ విశ్వమానవాళికి శాంతి సందేశం అందించిన శాంతిదూత యేసు ప్రభువు అన్నారు. యేసు బోధనలను ఆదర్శంగా తీసుకోవాల న్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లొ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకు కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు సింగారెడ్డి ప్రభాకర్, ఫాదర్లు షింటో, ఏసు రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల కుమార్, అక్కనపల్లి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి కందుల గట్టయ్య, జఫర్‌గఢ్ మండల ఇన్చార్జి పసునూరి మహేందర్ రెడ్డి, నాయకులు మారపల్లి ప్రసాద్, మండల యూత్ నాయకుడు గుండె మల్లేశ్, కార్యవర్గ సభ్యులు గాదె రాజు, మండల అధికార ప్రతినిధి ఆకారపు అశోక్, చింత శ్రీనివాస్, నగేశ్, మతాంగి దేవయ్య, మాతంగి యాదగిరి, తాటికొండ రాజు పాల్గొన్నారు.
డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు
ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం క్రిస్మ్స్ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తాటికొండ రమేశ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ట్యాక్సీల్లో తరలించాలని డ్రైవర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు రడపాక రంజిత్‌కుమార్, కొయ్యడ రమేశ్, యాదగిరి, గోవిందు ప్రవీణ్, మునిగల శ్రీనివాస్, చిక్కుడు సమ్మయ్య, ఊరడి శ్రీనివాస్, నీల ప్రభాకర్, సింగపురం శ్రీనివాస్, గోవిందు రాజు, షాగ శంకర్ పాల్గొన్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్ : మండలంలోని సాగరం, తమ్మడపల్లి(ఐ), జఫర్గడ్, హిమ్మత్‌నగర్, తమ్మడపల్లి(జి) గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై క్రిస్మస్ కేకులను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు చూపిన శాంతిమార్గంలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ కరుణాకర్‌రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ సర్పంచ్ వట్టి ఇన్నారెడ్డి, తమ్మడపల్లి(ఐ), రఘునాథపల్లి, తీగారం, సర్పంచ్‌లు గాదెపాక అనిత, బొమ్మినేని శ్రీదేవి, జయపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ రవి కుమార్, నాయకులు రాజేశ్ నాయక్, అశోక్, సుధాకర్‌బాబు, మారపల్లి ప్రభాకర్, యాదగిరి, రమేశ్, రాజిరెడ్డి, నాగేశ్వర్రావు, నవీన్, హరి, నాగరాజు పాల్గొన్నారు.