తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అబద్దాల సంజయ్‌కి బుద్ధి చెప్పాలి
పంజాబ్‌లో కొంటరు.. తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరు?
కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, డిసెంబర్ 24 : బీజేపీ వాట్సాప్‌లో తప్పుడు వార్తలు సృ ష్టిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగెం, నల్లబెల్లి గ్రామాల్లో గోదాము ల నిర్మాణ పనులను డీసీసీబి చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. నాబార్డు నిధులు రూ. 41.42లక్షలతో సంగెంలో, నల్లబెల్లిలో రూ.36.21లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాములను నిర్మించనున్నారు. ఈసందర్భంగాసొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. అబద్దాల సంజయ్ పూటకో మాటతో తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. పంజాబ్‌లో ధా న్యం కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదో చెప్పాలన్నా రు. సంగెం సొసైటీలో ఫ్రాడ్ చేసి రుణాలు తీసుకున్న వారు తిరిగి డ బ్బులు చెల్లించకపోతే జైలుకు పోవటం ఖాయమన్నారు. డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. డీసీసీబీ ద్వారా రూ.1400 కోట్లకుపైగా రుణాలు ఇచ్చి వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, డీసీవో సం జీవరెడ్డి, నరహరి, మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు, సర్పంచ్‌లు సుదర్శన్, బాబు, కావటి వెంకటయ్య, కిశోర్‌యాదవ్, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మ ల్లేశం, ఎంపీటీసీలు కట్ల సుమలత, మెట్టుపల్లి మల్లయ్య, నాయకులు దొనికెల శ్రీనివాస్, మేరుగు వీరేశం, అశోక్ పాల్గొన్నారు.
పేదల కళ్లల్లో ఆనందం..
గీసుగొండ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పేదల కళ్లల్లో ఆనందం కనబడుతోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. తహసీల్దార్ సుహాసిని, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కార్పొరేటర్లు ఆకుల మనోహర్, సుంకరి మనీషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, మండల కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, సర్పంచ్‌లు పూండ్రు జైపాల్‌రెడ్డి, గోనె మల్లారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.