కరీమాబాద్, డిసెంబర్ 24 : పూర్తి స్థాయి వసతులతో కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం శుక్రవారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఆయన కలెక్టర్ గోపితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. నూతన భవనంతో పాటు విద్యార్థులకు క్రీడా మైదానం ఉండేలా చూడాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. ఫోర్టురోడ్డులోని ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చేపట్టనున్న అదనపు భవనం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా భవనం నిర్మించాలన్నారు. చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ భూమాత, నాయకులు పోశాల స్వామి, బజ్జూరి రవి, కర్నె రవీందర్, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు. అలాగే, కాశీ విశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించే నగర సంకీర్తన, మహాపడిపూజ ఏర్పాట్లను ఎమ్మె ల్యే పరిశీలించారు. 24 ఏళ్లుగా బొమ్మలగుడిలో మహా పడిపూజ, అన్నదానం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆల య ప్రధాన అర్చకుడు శివపురం రామలింగ ఆరాధ్య, శానిటరీ సూపర్వైజర్ మాదాసు సాంబయ్య, నాయకులు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, ఆమంచ శ్యాం పాల్గొన్నారు.
అదనపు షాపుల నిర్మాణానికి స్థల పరిశీలన
కాశిబుగ్గ : వరంగల్ లక్ష్మీపురంలోని నూతన కూరగాయల మార్కెట్లో అదనపు షాపుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే నన్నపునేని, కలెక్టర్ గోపి స్థలాన్ని పరిశీలించారు. మార్కెట్ చైర్పర్సన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..
కాశీబుగ్గ : వరంగల్ ఇండోర్ స్టేడియంలో అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మె ల్యే నన్నపునేని కేక్ కట్ చేసి, పేదలకు వస్ర్తాలు అందజేసారు. కార్యక్రమంలో సీతామహాలక్ష్మి, పీఆర్ సాల్మన్, బిషప్ ప్రేమ్‌కుమార్, కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.