జేసీ స్వర్ణలతకు జిల్లా టీసీఎఫ్ సభ్యుల వినతిపత్రం
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 24: వినియోగదారుల కమిషన్, సైప్లె కమిషన్ వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్జ్యూమర్ ఫోరం సభ్యులు శుక్రవారం జేసీ కే.స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. జాతీయ వినియోగదారుల దినోత్స వం సందర్భంగా కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో జిల్లా తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం(టీసీఎఫ్) సభ్యులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీసీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ ఏ వస్తువైనా ఎక్కువ ధరకు అమ్మితే సంబంధిత శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ అధికారులకు సహకరిస్తారని తెలిపా రు. వినియోగదారుల కమిషన్, సైప్లె కమిషన్ వేర్వేరుగా ఏర్పాటు చేస్తే వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బద్రి రాజ్‌కుమార్, కోశాధికారి దేవరాజ్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
అవగాహన కలిగి ఉండాలి
చిట్యాల : వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని చిట్యాల తహసీల్దార్ రామారావు అన్నా రు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాతీయ వినియోగదారుల హక్కుల ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సైంటిస్ట్ శివ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సావిత్రి లెక్చరర్లు సురేశ్, రమేశ్, తిరుమల పాల్గొన్నారు.
కాటారంలో…
కాటారం : వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్స వాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాటారం సీఐ రంజిత్‌రావు, ఎస్సై శ్రీనివాస్ వినియోగదారుల ఫోరం సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. సీఐ మాట్లాడుతూ వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సృజ న, మండలాధ్యక్షుడు రాకేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రణ య్, పోచయ్య, శ్రీనివాస్, రజినీకాంత్, రాజు ఉన్నారు.