సంక్షేమ పథకాల ప్రదర్శనకు ములుగులో ట్రయల్న్
పరిశీలించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగురూరల్, డిసెంబర్ 24 : ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేడారంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ములుగులో ట్రయల్న్ నిర్వహించగా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఈ ఎల్ఈడీ ప్రొజెక్టర్‌ను మేడారంలో వినియోగించనున్నట్లు తెలిపారు. జాతర అనంతరం మండలాల వారీగా షెడ్యూల్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
వినియోగదారుల అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తున్న తీరుపై ఆయన వినియోగదారుల సమాఖ్య సభ్యులను అభినందించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య, సంగ రంజిత్, అవుల వెంకన్న, గాదె సుమన్ తదితరులు పాల్గొన్నారు.