గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పించని దద్దమ్మలు బీజేపీ ఎంపీలు
వడ్లు కొనే వరకూ పోరాటం
భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రేగొండ, డిసెంబర్22: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతు పాలన కొనసాగుతుంద ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారె డ్డి అన్నారు. మండలంలోని మడుత్తపల్లి గ్రామం లో రైతు వేదిక, హెల్త్ సెంటర్ భవనం, అండర్ డ్రైనేజీ, సీసీ, అంతర్గత రోడ్లను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రాజక్కపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక సర్పంచ్ కుసుంబ రంజిత్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్క రించుకోవడానికి సీఎం కేసీఆర్ రైతు వేదికలు ఏ ర్పాటు చేయడం అభినందనీయయన్నారు. తెలం గాణలో రైతు రాజ్యం స్థాపన చేయాలనే సంకల్పం తో సీఎం ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు రైతుబీ మా, రైతుబంధు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఏ దేశంలో లేని విధంగా గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పే ర్కొన్నారు. యాసంగిలో వడ్లు కొనడానికి బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని, తెలంగాణ నుంచి గెలుపొందిన ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు కేంద్రాన్ని ఒప్పించకుండా దద్దమ్మల్లా కూర్చుంటు న్నారని విమర్శించారు. ప్రశ్నించడానికి వెళ్లిన తె లంగాణ ఎంపీలను పనిలేకుండా వచ్చారని హా స్యాస్పదంగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. కేంద్రం వడ్లు కొనే వరకూ పోరాడుతామన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రా వు, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజ య, సర్పంచ్ కుసుంబ రంజిత్, ఎంపీడీవో సురేంద ర్, తహసీల్దార్ జీవాకర్‌రెడ్డి, డీఈ ఆత్మారావు, ఏవో వాసుదేవరెడ్డి, ఏఈవో గోవర్ధన్, ప్రశాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, మటిక సంతోష్, చైర్మన్ ఇంగే మహేందర్, నాయ కులు కొల్గూరి రాజేశ్వర్‌రావు, సూర నర్సింగరా వు, మహేందర్, అవునూరి సుధాకర్ ఉన్నారు.
జ్యోతిరావు ఫూలే గురుకులం తనిఖీ
మండలంలోని లింగాల క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాన్ని ఎమ్మె ల్యే గండ్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెంక టరమణారెడ్డి మాట్లాడుతూ ఆధికారులు తమ పని తీరును మార్చుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు ఇతర వసతు లు కల్పించాలని, లేకుంటే చర్యలు తప్పవని హె చ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ లక్ష్మి, టీఆర్ ఎ స్ నాయకులు రాజేందర్, పాపిరెడ్డి, కోలెపాక భిక్షపతి తదితరులు ఉన్నారు.