పునరావాసం త్వరగా కల్పించాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జెన్కో గెస్ట్ హౌస్‌లో సమీక్ష
గణపురం, డిసెంబర్ 22 : భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జెన్కో గెస్ట్ హౌస్‌లో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి సంబంధిత రెవెన్యూ అధికారుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణపురం, మల్హరావు, భూపాలపల్లి మండలాల్లో భూమి, ఇంటి స్థలం కోల్పోతున్న ప్రజలకు పునరావాసం త్వరగా కల్పించాలన్నారు. సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. జెన్కో బోర్డు సభ్యులతో సంప్రదించి నష్ట పరిహరం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాజమాన్యం ప్రజల పక్షాన పని చేస్తుందన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రజలు నష్టపోకుండా ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జెన్కో ఎస్ఈ తిరుపతయ్య, తాసిల్దార్లు ఇక్బాల్, సతీశ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.