ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్
నర్సంపేట, డిసెంబర్ 20 : శాంతియుత సమాజ స్థాపన కు ప్రజలు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. నగరంలోని బిలీవర్స్ చర్చ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభు త్వం అన్ని మతాల పండుగలను గౌరవిస్తోందన్నారు. ప్రపం చ శాంతి కోసం ఏసుక్రీస్తు పాటుపడ్డారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి డివిజన్, పట్టణ స్థాయి పాస్టర్ల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు తినిపించారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్, తహసీల్దార్ రామ్మూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, పాస్టర్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు రూబెన్, సెక్రటరీ ఆనంద్‌రాజు, కోశాధికారి కొముర య్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్మస్ సంబురాలు
చెన్నారావుపేట : మండలంలోని లింగాపురం గ్రామంలో అగ్నిజ్వాల మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దైవజనులు బ్రద ర్ మేరుగు నవీన్, సర్పంచ్ తప్పెట రమేశ్ హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నర్సంపేట బిలీవర్స్ చర్చి ఫాస్టర్ రెవరెండ్ రెజిజార్జ్, బ్రదర్ గుల్లపెల్లి సాంబయ్య, వీవో అధ్యక్షురాలు ఎలుగోయ శ్రీలత, నవ్య, సుధాకర్, ఎల్లస్వామి, జోసెఫ్, సతీశ్ పాల్గొన్నారు.
దుస్తుల పంపిణీ
గీసుగొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని జాన్‌పాకలో ఉన్న మన్నా చర్చిలో క్రైస్తవులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వమతాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్, కార్పొరేటర్ వర్కుల బాబు, సువర్ణ, బోగి సురేశ్, అధ్యక్షుడు జే రవికుమార్, చర్చి అడ్వైజర్ సాల్మన్ పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు ఆచరణీయం
వరంగల్ : క్రీస్తు బోధనలు ఆచరణీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు.బల్దియా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కౌన్సిల్హాల్లో ప్రీ క్రిస్మస్ వేడుకల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి హాజరయ్యారు. దసరా, రంజాన్ పండుగలకు ప్రభుత్వం దుస్తులను అందచేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సర్వమత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ దయ,క్షమాగుణం ఉండాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుస్తులను మేయర్, కమిషనర్ నాలుగో తరగతి సిబ్బందికి అందచేశారు. అనంతరం పాస్టర్ కురియన్ నేతృత్వంలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటి కమిషనర్ జోనా, పన్నుల అధికారి శాంతికుమార్, సర్జన్ రాజ్, డీఎఫ్‌వో కిశోర్‌కుమార్, జేఏసీ అద్యక్షులు గౌరిశంకర్, కార్యదర్శి గోల్కోండ శ్రీను, ప్రతినిధులు రాజారపు భాస్కర్, బోట్ల రమేష్, బాకం సంతోష్, సురేశ్ పాల్గొన్నారు.