పెద్దవంగర, డిసెంబర్ 19: కొత్తగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దవంగర మండల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మండల కేంద్రం లో దాతలు విరాళంగా ఇచ్చిన సర్వే నంబర్ 522లో 1.20ఎకరాల భూమిని మంత్రి ఎర్రబెల్లి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవంగర మండలం అన్ని విధాలా అభివృద్ధి సాధించేలా నిధులు అందించనున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. మండల ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు భూవితరణ చేసిన కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి, జాటోతు నెహ్రూనాయక్, పాలకుర్తి యాదగిరిరావు, అనబత్తుల ప్రభాకర్‌రావు, అనబత్తుల నాగేశ్వరరావు, ముప్పాల సురేష్‌బాబు, చెరుకు మహేశ్వర్‌రెడ్డి, పసులేటి వెంకట్రామయ్యను అభినందించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఐకేపీ, వ్యవసాయ, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాలను ఆ స్థలంలో నిర్మించనున్నట్లు తెలిపారు. భూవితరణ పత్రాలను దాతలు మంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీలు జ్యోతిర్మయి, రాష్ట్ర మాజీ జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, తహసీల్దార్ సరితారాణి, ఎంపీడీవో శేషాద్రి, ఎంపీవో యాకయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా రైతుబంధు సభ్యుడు నెహ్రూనాయక్, మండల రైతు బంధు సభ్యులు సోమనర్సింహరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సంజయ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సుధాకర్, వెంకన్న, వెంకట్రామయ్య, రవి, సోమన్న, సమ్మయ్యయాదవ్, మల్లికార్జునచారి, లింగమూర్తి, సమ్మయ్య, భిక్షపతి, టీఆర్ఎస్ యూత్ నాయకులు హరీష్, అనుదీప్, వెంకటేశ్, అనిల్ పాల్గొన్నారు.