బచ్చన్నపేట, డిసెంబర్ 18 : మండలంలోని కొడవటూరు శ్రీ గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో శనివారం దత్తాత్రేయస్వామి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ పూ జలు నిర్వహించారు. సుప్రభాతసేవ, విఘ్నేశ్వరపూజ, స్వస్థివాచనము, అఖండ దీపారాధన, రుత్విగ్వరణం, కలశస్థాపన, మంటపారాధన, స్థాపిత దేవతాపూజ, అగ్నిప్రతిష్ఠ, హవనములు కొనసాగించారు. అనంతరం అవాహిత దేవతాహవనం, స్థాపిత దేవత మూలమంత్ర హవనం, రు ద్రగురు గీతాహవనం, జయాదుల, బలిహరణం, పూర్ణాహుతి, మంగళహారతతి, మంత్రపుష్ఫం, తీర్దప్రసాద వినియోగం, మహాప్రసాదన నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచేగాక జనగామ, సిద్దిపేట, చేర్యాల, ఆలేరు, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. జయంతి ఉత్సవాలకు గోవిందాశ్రమస్వామి హాజ రై భక్తులకు ఉపదేశం ఇచ్చారు. ధర్మం ఎంతో గొప్పదని, తనకు తను రక్షించుకుంటూనే ఇతరులను రక్షిస్తుందన్నారు. దత్త అంటేనే దానం చేయడమని, సమాజంలో అందరూ ఇచ్చే వాళ్లుగా ఎదగాలన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : సద్గురు నిత్య నిర్మలానంద ఆధ్వర్యంలో శనివారం మండలంలోని మల్లపల్లిలో దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సెలువోజు చంద్రమౌళి హేమలతాదేవి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వగురువు దత్తాత్రేయుడు అని పేర్కొన్నారు మహావిష్ణువు ప్రతి రూపంగా శ్రీపావలంభుడిని కొలుస్తారన్నారు. స్వామి హస్తాల్లోని శంఖు చక్రం విష్ణుమూర్తికి ఢమరుకం, త్రిశూలం శివుడికి, జపమాల బ్రహ్మదేవుడికి చిహ్నాలుగా పేర్కొంటారని తెలిపారు. దత్తత్రేయుడి ఆశీస్సులతో ప్రజలు ఆరోగ్యంగా, పాడిపంటలతో విలసిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరగాని కుమార్, గిరగాని హేమలత, మాశెట్టి రమేశ్, వసంత, రామగిరి దామోదర్, ధనమ్మ, రాపాక మల్లయ్య, పిచ్చమ్మ, గబ్బెట వెంకన్న, ఉమ, మాశెట్టి శ్రీనివాస్, అలివేలు, గర్వందుల మల్లేశ్, ప్రసన్న, శిరంశెట్టి సారయ్య, రాణి, పులిగిల్ల రజిత, యాకయ్య, ఇమ్మడి దామోదర్, చిదరాల జగదీశ్ పాల్గొన్నారు..