నాలుగు మైన్లలో ఒక్కదానికే టెండర్ ఫారం సమర్పణ
మిగతా మూడింటికి నిల్..
ఒక్క దరఖాస్తు కారణంతో ఆ ఒక్కటీ ఓపెన్ చేయలె..
కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖతో టెండర్ వేసేందుకు నిరాసక్తి
కార్మిక సంఘా పోరాటం, కార్మికుల సమ్మెతో ఆలోచనలో పడ్డ సంస్థలు
ఇక ముందూ అడ్డుకుంటాం: టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
శ్రీరాంపూర్, డిసెంబర్ 15: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంలో భాగంగా ఏ ఒక్క సంస్థ కూ డా టెండర్లు వేయలేదని టీబీజీకేఎస్ అధ్యక్షు డు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. కార్మికుల సమ్మె పోరాటం, సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖ తో ప్రైవేట్ సంస్థలు టెండర్లు వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం, కో లిండియా యాజమాన్యం సింగరేణిలోని బొగ్గు బ్లాకులకు టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఇందులో మంచిర్యాల జీల్లాలోని కేకే 6 భూ గర్భ గనికి ఏ ఒక్కరూ టెండర్ ఫాం తీసుకోలేదన్నారు. అలాగే శ్రావణపల్లి ఓసీపీకి ఒక్కరు మాత్రమే టెండర్ ఫాం తీసుకున్నారు. కానీ టెండర్లో పాల్గొనలేదు. ఖమ్మం జిల్లా సత్తుప ల్లి ఓసీపీ-3కి కూడా ఒక్కరే టెండర్ ఫాం తీసుకున్నారు. వారు కూడా టెండర్ దరఖాస్తు సమర్పించ లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం ఓసీపీ 3కి ముగ్గురు టెండర్ ఫాం తీసుకోగా, ఒక్కరు మాత్రమే టెండర్ వేశారు. ఒక్కరే టెండర్ వేయడంతో, టెండర్ ఓపెన్ చే యలేదు. కార్మిక సంఘాల ఐక్య పోరాటం, కార్మికుల సమ్మె, సింగరేణికే బొగ్గు బ్లాకులు కే టాయించాలని బీజేపీ, కోలిండియా యాజమాన్యానికి సీఎం కేసీఆర్ లేఖతోనే టెండర్లు పడలే దని స్పష్టం చేశారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలు కవిత నాయకత్వంలో కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులు విప్ బాల్క సుమన్, మంత్రి కొప్పు ల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మె ల్యేలు కాంతారావు, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, ఆత్రం స క్కు, వనమా వెంకటేశ్వర్రావు, హరిప్రియ, గండ్ర వెంకటరమణ, పుట్ట మధుతో పాటు అ న్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె పో రాటం చేశామని పేర్కొన్నారు. ఇకపై కూడా సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని చెపారు. ఇది కార్మికుల విజయమని స్పష్టం చేశారు.