విద్యార్థులకు నాణ్యమైనభోజనం అందించాలి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి
వెంకటాపురం(నూ)లో పర్యటన
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 15 : పేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయ న మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని జీసీసీ స్టోర్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రేషన్ బియ్యం ఏవిదంగా అందుతున్నాయో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల, ఎస్టీ బాలుర హాస్టల్, అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాలు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఆయన వెంట ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య, వెంకటాపురం తహసీల్దార్ అంటి నాగరాజు, జడ్పీటీసీ పాయం రమణ, ఎంపీడీవో ఫణిచంద్ర, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిడెంయామిలి, ఎంపీటీసీ కొండపర్తి సీతాదేవి, తదితరులు పాల్గొన్నారు.