తాడ్వాయి, డిసెంబర్15 : మండలంలోని దామరవాయి సమీపంలోని సూరగొండయ్యగుట్టపై ఉన్న ఆదిమానవుడి గుహలు ( రాకాసి గుహలు)ను బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వరంగల్ సీపీ తరుణ్‌జోషి కుటుంబ సమేతంగా సందర్శంచారు. ఈ సందర్భంగా అడవుల్లో ఉన్న మొత్తం గుహలను పరిశీలించారు. రాతి కట్టడాలను చూసి మంత్రముగ్దులయ్యారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. పూజారులు, దేవాదాయశాఖ అధికారులు వారికి ఘన స్వాగతంపలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ,ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమందికి టీకాలు వేశారు? మొదటి, రెండో డోసులు ఎంతమందికి ఇచ్చారని వైద్యాధికారి అవినాశ్‌ను అడిగితెలుసుకున్నారు. వారి వెంట డీసీపీ అడ్మిన్ వైభవ్‌గైక్వాడ్ ఉన్నారు. అలాగే సివిల్ సప్లయ్ కమిషన్ చైర్మన్ తిరుపతిరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.