దేశం గర్వించే రీతిలో తెలంగాణలో అభివృద్ధి
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి
యాదాద్రిలో పాలకుర్తి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం
తొర్రూరు, డిసెంబర్ 15: ‘దేశం గర్వించే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతోంది. కేంద్రం నుంచి ఆశించిన సాయం అందకున్నా వినూత్న రీతిలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నాం’ అని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గలోని అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తొర్రూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ టీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ మండల పార్టీల బాధ్యులు యాదాద్రి సన్నిధిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని ఘనంగా సన్మానించా రు. తొలుత యాదాద్రి లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమి స్తూ అభివృద్ధి పనులకు నిధుల కేటాయిస్తూ పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం పెరిగిందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పల్లెప్రగతి ద్వారా, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ద్వారా నిధుల కేటాయింపుతో అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనికతతో పనులు చేపడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఎన్నో అవార్డులను ప్రకటించిందన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ప్రత్యేక గౌరవ వేతనాలు, అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు వంటివి పరిష్కారమయ్యాయని తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సం స్థల ఎన్నికలు ఐక్యతను చాటాయని, అందుకే ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలపడానికి కూడా సాహసించలేదన్నారు. అందుకే ఎదురు లేకుం డా ఏకగ్రీవం సాధ్యమైందని, ఈ ఘనత గౌరవ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లదే అన్నారు. తన ఏకగ్రీవ ఎన్నికకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దయాకర్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.