పండుగకు పల్లెపట్నం ముస్తాబు
రంగవల్లులు, గొబ్బెమ్మలతో మెరువనున్న లోగిళ్లు
సందడి చేయనున్న హరిదాసులు
డూడూ బసవన్నల విన్యాసాలు
ఊరువాడా ఆధ్మాత్మిక శోభ
మహాముత్తారం/కాటారం/వెంకటాపురం(నూగూరు)/ భూపాలపల్లి రూరల్/ములుగు రూరల్ జనవరి 14: భోగి పండుగను శుక్రవారం వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేశా రు. ఇలా వేయ డం వల్ల శని దూరమవుతుందని చెబుతుంటారు. పిల్లలపై భోగి పళ్లు పోశారు. ఈ ఘట్టాన్ని శ్రీమన్నారాయణుడిని దివ్యమైన ఆశీస్సులుగా పరిగణిస్తారు. నేడు సంక్రాంతి, రేపు కనుమ పండుగను కన్నులపండువగా నిర్వహించుకోనున్నారు. సంక్రాంతికి ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెట్టనున్నారు. సౌభాగ్యవంతులైన మహిళలు నోములు నోచుకుని ముత్తయిదువులను పిలిచి ఆశీర్వాదం తీసుకుంటారు. కల కాలం సంతోషాలతో కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ నోములు, వ్రతాలు చేస్తారు.
ఉట్టిపడనున్న ఆధ్యాత్మిక శోభ
పండుగ సందర్భంగా ఊరూవాడా ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడనున్నాయి. భోగి పండుగ నుంచే వాకిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. ఇళ్లన్నీ పిండివంటలతో ఘుమఘుమలాడుతున్నాయి. పూలు, మామిడాకులతో ఇంటి గుమ్మాలు అందంగా కనిపిస్తున్నాయి. పలు చోట్ల ముగ్గు ల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు..
సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది గ్రామా ల్లో గంగిరెద్దుల విన్యాసం. కానుకలు స్వీకరిస్తున్నట్లుగా గంగిరెద్దులు తల ఊపడమే కాకుండా ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా మోకాలపై మోకరిల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ‘అయ్యగారికి వడం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టూ’ అంటూ గంగిరెద్దు ల వారు గ్రామాల్లో చేసే సందడి అందరినీ అకట్టుకుంటుంది. ఇక మరో ప్రత్యేక ఆకర్షణ హరిదాసు. తల మీద గుండ్రని గుమ్మడి ఆకారపు గిన్నె, నుదుట తిరునామం, మెడలో పూలహారం, చేతిలో వీణ, కాళ్లకు గజ్జెలు, అందుకనుగుణంగా నృత్యం, గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతూ ‘హరిలో రంగ హరీ’ అంటూ ఉదయాన్నే దర్శనమిస్తారు. గుమ్మడి ఆకారపు గిన్నె భూమికి సంకేతమని, దాన్ని హరిదాసు తల మీద ధరించి రావడ మంటే శ్రీహరే భూమిని రక్షిస్తూ ఉంటాడనేదానికి సంకేతమని భావిస్తారు. తెలవారగానే హరిదాసు రావడం అంటే సాక్షాత్తూ శ్రీమహా విష్ణువే ఇంటికి వచ్చినట్లు నమ్ముతారు. హరిదాసు పాత్రలో బియ్యం వేయడమనేది.. రాబోయే పంట కోసం ధాన్యాన్ని భూమిలో విత్తనాలుగా వేయడానికి సంకేతమని చెబుతుంటారు. శ్రీహరి అనుగ్రహంతో భూమి మ నకు పంటనిస్తే శ్రీహరి ప్రతినిధికి కృతజ్ఞతాభావంగా సమర్పించడమనేది ఇందులో అంతర్థానంగా కనిపిస్తుంది.