పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
రద్దీగా మారిన గద్దెల ప్రాంగణం
తాడ్వాయి, జనవరి 12 : మహా జాతర సందర్భంగా మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. బుధవారం భక్తులతో తల్లుల ప్రాంగణం కిటకిటలాడింది. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బెల్లం, పసుపు, కుంకుమ సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో కోయదొరల వద్ద జాతకాలు జాతకాలు చెప్పించుకునేందుకు ఆసక్తికనబర్చారు.