సేంద్రియ సాగుతో ఆరోగ్యం బాగు
యువ రైతు సమ్మేళనంలో వక్తలు
తొర్రూరులో వీఎంఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఉమ్మడి జిల్లాకు చెందిన 400 మంది ఆదర్శ యువ రైతులకు సన్మానం
తొర్రూరు, జనవరి 12: ‘యువత తలచు కుంటే వ్యవసాయానికి భవిత ఉంటుంది.. సేంద్రి య సాగుతో ఆరోగ్యం బాగుంటుంది’ అని వక్తలు పేర్కొన్నారు. సేంద్రియ సాగుతో సమాజాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా యువ రైతులను ప్రోత్సహించేందుకు వందేమాతరం ఫౌండేషన్, కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో బు ధవారం యువజన దినోత్సవం సందర్భంగా యు వ రైతు సమ్మేళనం నిర్వహించారు. వీఎంఎఫ్ డైరె క్టర్ రవీంద్ర సారథ్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదర్శ, సేంద్రి య రైతు మేక రాధాకృష్ణమూర్తి, సేంద్రియ సాగు లో హోమియో విధానాన్ని మిళితం చేసి అనేక మొండి తెగుళ్ల నివారణకు మార్గం చూపిస్తున్న అమేయ కృషి వికాస కేంద్రం యజమాని దిట్ట బాల్‌రెడ్డి, గచ్చిబౌలి నీట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యాం సుందర్‌రెడ్డి, రైతు, తొర్రూరు డీఎస్పీ వెంకటర మణ, వీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి రాకేశ్ పాల్గొని రైతులకు వి లువైన సూచనలను అందించారు. నేటి యువ తను ఆధునిక యాంత్రీకరణను ఉపయోగించు కుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే సాగు విధానాన్ని అలవర్చు కుంటే ఎలాం టి ఫలితాలు వస్తాయో పలు ప్రాంతాల యువ రైతులు వారి అనుభవాన్ని ఆవిష్కరించారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సమాజ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మనం మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎలా ఎదగాలని అనేక మంది యువ రైతులు వారి సక్సెస్, సీక్రెట్స్‌ను పంచుకున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివి కార్పొరేట్ కబంధ హస్తాల్లో విసిగిపోయి ప్రస్తుతం సాగుబాట పట్టిన యువ రైతులు ఎలాంటి పంట లు పడిస్తున్నారో, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకుని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తు న్నారో వివరించారు.
విచ్చలవిడిగా రసాయన పురుగు మందుల వినియోగంతో విషతుల్యమైన వాతావరణం, జీవజాలానికి వ్యాపిస్తున్న రుగ్మత లపై డాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి తన పరిశోధనా ఫలి తాలను సభలో వివరించారు. మిర్చిలో వ్యాపిం చిన తామర పురుగు నివారణకు హోమియో మందును వినియోగిస్తే ఎలాంటి మంచి ఫలితా లు వచ్చాయో బాల్‌రెడ్డి రైతులకు వివరించారు. మోతాదు మించితే చేకూరే దుష్ఫలితాలను కూ డా వివరించారు. వ్యవసాయ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందేలా మార్కెట్లోకి వచ్చిన ఆధునిక పని ముట్లు, మైక్రో ఇరుగేషన్లో నూతన పరికరాలు, అధిక దిగుబడు లను ఇచ్చే పలు విత్తనాల రకాలు, సేంద్రియ వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు, వినియో గించే విధానం, పంటలపై తెగుళ్ల నివా రణకు హోమియో మెడిసిన్ పని తీరు వంటి స్టాల్స్‌ను సమ్మే ళనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువ రైతులను వందేమాతరం ఫౌం డేషన్, కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రెవ ల్యూషన్ వలంటీర్లు, ప్రతినిధులు గంట రవీంద ర్‌రెడ్డి, వేం శ్రీధర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, దర్గ య్య, మ హేందర్, ఉనిల్, సందీప్, విద్యార్థులు బొట్టుపెట్టి శాలువా కప్పి పాదాభి వందనం చేసి సత్క రించారు. సమ్మేళనంలో వీఎంఎఫ్ విద్యార్థులు వ్యవసాయ నేపథ్యంపై చేసిన సాంస్కృ తిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టు కు న్నాయి. పలువురిని ఆలోచింపజేశాయి.