ఐనవోలు, డిసెంబర్ 11: ఐలోని మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దా మని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చా రు. మల్లికార్జునస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన మల్లన్న బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద జాతర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా తగ్గొదని అధికా రులకు సూచించారు. ఐలోని మల్లన్న దేవాల యం చరిత్రాత్మకమైంది, మహిమాన్వితమైంది. దేవాలయాన్ని తరచుగా దర్శిస్తూ ఉంటాను.. నేను ఏ ఎన్నికల్లో పోటీచేసినా ముందుగా స్వామిని దర్శించుకుని వెళ్లి నామినేషన్ వేస్తాను. ప్రజల ఆదరణ.. స్వామి ఆశీస్సులతో ప్రతిసారి గెలుస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. మల్లన్న సన్నిధిలో సేవచేయడం అదృష్టంగా భావించాల ని చెప్పారు. పున్నేలు క్రాస్ నుంచి ఐనవోలు దేవాలయం వరకు రోడ్డును డబుల్ రోడ్డుగా మరింత అభివృద్ధి పరచాలి.. స్వాగత తోరణాలు అద్భుతంగా ఉన్నాయి.. ఆలయం చుట్టూ బైపాస్ రోడ్డు పూర్తి చేస్తే, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరితహోటల్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే అరూరిరమేశ్ మాట్లాడా రు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, డీఎంహెచ్‌వో లలితాదేవి పాల్గొన్నారు.