వాజేడు, డిసెంబర్ 11 : ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని వాజేడు, పేరూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో శనివారం వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టారు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన వారికి అవగహన కల్పించి వారికి వ్యాక్సిన్ వేశారు. 18 సంవత్సరాలు దాటిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. పేరూరు పీహెచ్సీ పరిధిలోని ధర్మవరం, లక్ష్మీపురం, అయ్యవారిపేట, పే రూరు, పెద్దగంగారం గ్రామా ల్లో 300 మందికి, వాజేడు పీహెచ్సీ పరిధిలోని చీకుపల్లి, కోయవీరపురం, ఎడ్జర్లపల్లి, వాజేడు, మొరుమురు గ్రామాల్లో 246 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు డిప్యూ టీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వర్లు, పేరూరు వైద్యాధికారి సీతారామరాజు నరహరి తెలిపారు. కార్యక్రమం లో వైద్యసిబ్బంది, జీపీ అధికారులు పాల్గొన్నారు.
రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి
భూపాలపల్లిటౌన్: ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ రఘుపతిరావు సూచించారు. భూపాలపల్లి మండలంలోని గుడాడ్‌పల్లిలో శనివారం వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ వైస్ చైర్మన్, ఎంపీడీవో అనిల్ కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కొత్త వేరియంట్‌తో రాష్ర్టాల్లోకి ప్రవేశిస్తున్నదని, ఈ పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. గుడాడ్‌పల్లిలో వందశాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, రెండో డోసు వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉడుత లక్ష్మి ఐలయ్య యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి
గోవిందరావుపేట: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని పస్రా పీహెచ్సీ వైద్యాధికారి మధు సూచించారు. వైరస్ నివారణ చర్య ల్లో భాగంగా వైద్య, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఇం టింటా తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. రెండు టీకాలు వేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు.