భూపాలపల్లి, డిసెంబర్ 11: భూపాలపల్లి ఏరియాలో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబి స్తున్న కార్మికవ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జేఏసీ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. చివరి రోజైన శనివారం అత్యవసర సిబ్బంది మినహా కార్మికులంద రూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, కేటీకే-5, కేటీకే -6, కేటీకే -8 భూగర్భ గనులతోపాటు కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ-3లలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. బొగ్గు రవాణా కూడా జరుగలేదు. లారీలు, టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచాయి. జనరల్, మొదటి షిఫ్టుల్లో మొత్తం 3,400 మంది ఉద్యోగులు హాజరుకావాల్సి ఉండగా, అత్యవసర సిబ్బంది 501మంది ఉద్యోగులు మాత్ర మే హాజరయ్యారు. రెండో షిఫ్టులో మొత్తం 1,109 మంది ఉద్యోగులు హాజరుకావాల్సి ఉండగా అత్యవసర సిబ్బంది 169 మంది మాత్రమే హాజరయ్యారని భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం తెలిపారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా
టీఆర్ఎస్ అనుబంధ సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి, కార్మిక కాలనీల్లో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏరియాలోని కేటీకే ఓసీపీ-2వ గని వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ర్యాలీ, ధర్నాలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వయంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, శ్రీ భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, టీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు రత్నం సమ్మిరెడ్డి, బడితల సమ్మయ్య, తుమ్మెటి రఘోత్తంరెడ్డి, రాజిరెడ్డి, నలబెల్లి సదానందం, రాయిశెట్టి కనకయ్య, కొచ్చర్ల రవికుమార్, గాజే సాంబయ్య, భాషణపల్లి కుమారస్వామి పాల్గొన్నారు.
సింగరేణికే బొగ్గు బ్లాకులను కేటాయించాలి