క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు
వెంకటాపురం(నూగూరు), జనవరి9 : క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు అన్నారు. ఆలుబాక గ్రామంలో అలుబాక యంగ్ స్టార్ ఆధ్వర్యంలో బాలసాని ముత్తయ్య మెమోరియల్ క్రికెట్ టోర్నీని గతనెల 29న ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్రావు హాజరయ్యారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి ఫైనల్ క్రికెట్ పోటీల్లో విన్నర్స్‌గా పాల్వంచ జట్టు, రన్నర్‌గా ఆలుబాక జట్టు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేల నగదును నిర్వాహకుల ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ, వ్యాపారి బాలసాని అశ్వాపతి, సర్పంచ్ పూజరి ఆదిలక్ష్మి, ఎంపీటీసీ రేగ భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు, కార్యదర్శి మురళి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు
మొగుళ్లపల్లి: మండలంలోని మొట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నరహరి పద్మ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందులో 19 జిల్లాలకు చెందిన 220 మంది యువతీయువకులు పాల్గొన్నట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ సాంబయ్య తెలిపారు. గెలుపొందిన వారు పంజాబ్‌లో జరిగే ఫైనల్స్‌లో ఆడుతారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపెల్లి శ్రీనివాస్, పీఈటీ రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య, ఎంపీటీసీ సభ్యురాలు నరహరి కల్పన, ప్రధానోపాధ్యాయుడు సదానందం పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
ఏటూరునాగారం: ప్రశాంత వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి కోరారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో షేక్ ఖాజా మొహినుద్దీన్ జ్ఞాపకార్థం లైవ్‌హుడ్ బ్రిడ్జింగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 30 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు సప్పిడి రాంనర్సయ్య, నిర్వాహకులు తుమ్మ అరుణ్, బండ రమేశ్, తుమ్మ విష్ణుతేజరెడ్డి, చందా శ్రావణ్‌కుమార్, బొంగు సాయి పాల్గొన్నారు.
.