పరిశీలించిన డీఎంహెచ్‌వో అప్పయ్య
తాడ్వాయి, జనవరి 8 : సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నందున మేడారంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు మేడారంతో పాటు సమీప గ్రామాలైన రెడ్డిగూడెం, కొత్తూరు. నార్లాపురం, ఊరట్టం, కాల్వపల్లిలో సిబ్బంది సర్వే చేపట్టినట్లు చెప్పారు. 1,345 ఇళ్లకు గాను 122 ఇళ్లలో సర్వే చేయగా 339 మందిని పరిశీలించగా 13 మందికి జలుబు, దగ్గు ఉన్నట్లు గుర్తించారు. వారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ వారిని వారం రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించినట్లు డీఎంహెచ్‌వో వివరించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న సంతోషికుమారి ఇదే దవాఖానలో డెలివరీకాగా డీఎంహెచ్‌వో ఆమెతో మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేయించుకున్నందుకు అభినందించారు.