కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
గణపురంలో రైతుబంధు సంబురాలు
భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ
18 మంది రైతులకు సన్మానం
గణపురం, జనవరి 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం గణపురం మండల కేంద్రంలో రైతుబంధు సంబురాలు జరిగాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధులో 8వ విడతలుగా రూ.50వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశారని తెలిపారు. రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు చేయాలన్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం వంటివి చేపట్టాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను బీజేపీ నాయకులు చూసి ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో 18 మంది ఉత్తమ రైతులకు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌భాస్కర్, మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గణపురం మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు, గణపురం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్, గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, నడిపెల్లి మధుసూదన్‌రావు, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, కుమారస్వామి, ఎంపీటీసీలు శివశంకర్ గౌడ్, చెన్నూరి రమాదేవి, పొనగంటి సుందర్మ మల్హల్ రావు, మంద అశోక్‌రెడ్డి, సరస్వతి, గణపురం టీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మేకల రజిత, గణపురం ఉప సర్పంచ్ పోతర్ల అశోక్ యాదవ్, మెతె కర్ణాకర్ రెడ్డి, మారగని శ్రీనివాస్, వడ్లకొండ నారాయణ గౌడ్, ఒద్దుల అశోక్ రెడ్డి, మామిండ్ల సాంబయ్య, గంగధర్ రావు, కుమారస్వామి, బోయిని సాంబయ్య పాల్గొన్నారు.
రేపు జిల్లా కేంద్రంలో మెగా ముగ్గుల పోటీ
జిల్లా కేంద్రంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా ఈనెల 9వ తేదీన మెగా ముగ్గుల పోటీలు నిర్వహి స్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈమేరకు అంబేద్కర్ స్టేడియాన్ని శుక్రవారం ఎమ్మె ల్యే, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, సింగరేణి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ముగ్గుల పోటీలకు మహిళలు అధికసంఖ్యలో హాజరై హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ మైదానంలో రాజేశం స్మారకార్థంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీను పరిశీలించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు రవీందర్‌గౌడ్, స్వామి, జక్కం రవికుమార్, మురళీధర్, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్ పటేల్, ప్రధాన కార్యదర్శి బీబీచారి, అర్భన్ మాజీ అద్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, కరీం, చాట్ల రాములు యాదవ్, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కు ల తిరుపతి, భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.