నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కొత్తవాడలో వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
పోచమ్మమైదాన్, జనవరి 7 : వరంగల్ తూర్పులో చేపడుతున్న రోడ్డు పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాంట్రాక్టర్లకు సూచించారు. వరంగల్ కొత్తవాడలో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీ కాల్వల పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పులో ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి, మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన…
దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఏకశిల స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే నన్నపునేని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన బాలబాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో గోపాల్‌రావు, మెడికల్ ఆఫీసర్ భరత్‌కుమార్, ఏకశిల విద్యా సంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి, కార్పొరేటర్ బస్వరాజు కుమార్ పాల్గొన్నారు.
పేదల ఆకలి తీర్చడంలోనే సంతృప్తి..
వరంగల్ చౌరస్తా : పేదల ఆకలిని తీర్చడంలోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వరంగల్ సీకేఎం దవాఖానలో వాసవి గణపతి సేవా సమితి, వాసవి గణపతి పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అన్నదానం కోసం అవసరమయ్యే ఆహార పదార్థాలు వండేందుకు కేటాయించిన వంట గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాదేవి, కార్పొరేటర్ గందె కల్పన, సమితి సభ్యులు యర్ర ప్రకాశ్, దుబ్బ శ్రీనివాస్, గంధం సదాశివుడు, ఓలం సదాశివుడు, పల్లా రాజేశ్వర్, పోలా మురళీధర్, మహేందర్, సత్యనారాయణ, వెంకటరమణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.