ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పాల్గొన్న మేయర్ గుండు సుధారాణి
మట్టెవాడ, జనవరి 7 : ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ 29వ డివిజన్లోని రామన్నపేటలో సీఎం సహాయనిధి చెక్కులను మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గుజ్జారి మహేశ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కల్పలత సూపర్‌బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫీ, డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, టీఆర్ఎస్ నాయకులు రాచర్ల రాము, రుద్ర శ్రీనివాస్, గట్టు చందు, నక్క జ్యోతి, ఎస్కే రహ్మాన్, రామగిరి ముఖేశ్, గొడిశాల సూరజ్‌గౌడ్, మాల్వే రాజు, భరతపు సంజీవ, ముప్పు సతీశ్, గట్టు శివ, సుమన్, ఆర్సీలు అరుణ, లక్ష్మి, రజిత, హేమలత, జయశ్రీ, లీల, మంజుల తదితరులు పాల్గొన్నారు.
రామచంద్ర రామానుజ జీయర్ స్వామిని కలిసిన చీఫ్‌విప్, మేయర్
వరంగల్ చౌరస్తా : త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామిని మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. శుక్రవారం వరంగల్ గీతాభవన్‌లో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలకు హాజరైన ఆయనకు అర్చకులు ముడుంబై నరసింహరంగాచార్య స్వామి, ముడుంబై శ్రీమన్నారాయణాస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాఫ్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి, కార్పొరేటర్ సురేందర్‌రెడ్డి, సదాంత్, సర్దార్‌సింగ్ పాల్గొన్నారు.