రాష్ట్రంలోనే తొలిసారి నర్సంపేట నియోజకవర్గంలో జారీ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
దరఖాస్తుల పరిశీలన
నర్సంపేట, జనవరి 7 : అర్హత ఉన్న ప్రతి రైతుకూ కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్ని మండలాల నుంచి నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు అర్జీలు తీసుకోవాలని కోరారు. గొల్లకుర్మలు, మత్స్యకారులు, పాడి రైతులు అర్హులన్నారు. ఈ కిసాన్ కార్డుపై కేవలం 30 పైసల వడ్డీతో రూ. 25 వేల నుంచి లక్షా అరవైవేల వరకు రుణం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలోనే ఈ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. కార్డు పొందిన వ్యక్తికి రూ. 2లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందన్నారు. ఎస్సీ డెయిరీ పైలట్ ప్రాజెక్టు లబ్ధిదారులు కూడా అర్హులని తెలిపారు.