కొనసాగుతున్న అభివృద్ధి పనులు
అవగాహన కల్పిస్తున్న అధికారులు, జీపీ సిబ్బంది
అందంగా కనిపిస్తున్న పల్లెలు
భూపాలపల్లి, జూలై 4 : పట్టణ ప్రగతి పనులు భూపాల పల్లి మున్సిపాలిటీ పరిధి లో నాలుగో రోజైన ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. 12వ వార్డులో మున్సిపల్ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, 15, 18, 24 వార్డుల్లో కౌన్సి లర్లు నాగవెళ్లి సరళారాజలింగమూర్తి, నాగుల శిరీషా దేవేం దర్‌రెడ్డి, శిరుప అనిల్‌కుమార్ పాల్గొన్నారు. రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు.
శ్రీరాంపూర్‌లో…
భూపాలపల్లి టౌన్ : జిల్లాలోని రాంపూర్ గ్రామంలో పల్లెప్రగతి పండుగలా కొనసాగింది. సర్పంచ్ తాటి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు స్వచ్ఛం దంగా పాల్గొని బావులను పూడ్చి, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలిగించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సముద్రాల దీపా రాణి, స్పెషల్ ఆఫీసర్ సతీశ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు
టేకుమట్ల : మండలంలోని అని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారు లు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. టేకుమట్ల, ఆశిరెడ్డిపల్లి, దుబ్యా ల, రాఘవరెడ్డిపేటలో పారిశుధ్య పనులను మండల ప్రత్యే క అధికారి పురుషోత్తం పరిశీలించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో చండీరాణి, ఏపీవో మాధవి, ఎంపీవో రామ్ ప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్య పర్చాలి
మహదేవపూర్: తడి, పొడి చెత్తపై గ్రామస్తు లను చైతన్య పర్చాలని జయ శంకర్ భూపాలపల్లి జడ్పీ సీఈవో, మండ ల ప్రత్యేక అధికారి శోభారాణి సూచించారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పల్లెప్రగతిలో భాగంగా గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటేలా బాధ్య తలు స్వీక రించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ వేణి, తహ సీల్దార్ శ్రీనివాస్, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి, జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్ సల్మాన్ పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లె ప్రగతి పనులు
మల్హర్: పల్లెప్రగతి పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగాయి. మల్హార్, తాడిచర్లతో పాటు అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. కొయ్యూర్‌లో డీపీవో ఆశా లత పారిశుధ్య పనులు పర్యవేక్షించారు. కార్యక్రమం లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీర్లు పాల్గొన్నారు.
ప్రగతి పనులు నిర్వహించాలి
పలిమెల: పల్లెప్రగతి పనులను గ్రామాల్లో పకడ్భందీగా నిర్వహించాలని క్వాలిటీ కంట్రోల్ అధికారి ధరమ్‌సింగ్ అన్నారు. మండలంలోని లెంకలగడ్డ గ్రామంలోని పల్లెప్రగతి పనులు, నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పలిమెలలో సర్పంచ్ జవ్వాజి పుష్పలత, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ అధ్వర్యంలో తడి, పొడి చెత్త వేరుచేయడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీలంపల్లి, దమ్మూరులో పంచాయతీ కార్యదర్శులు మదన్, పీటర్పౌల్ అధ్వర్యంలో గడ్డిని తొలగించారు.
జోరుగా పల్లె ప్రగతి పనులు
మహాముత్తారం : పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని కొర్లకుంట గ్రామంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు పరిశీలించారు. మహిళలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర నవీన్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు.
తడి, పొడిచెత్తపై అవగాహన
మొగుళ్లపల్లి : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తడి, పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పిం చా రు. విద్యుత్ సిబ్బంది వైర్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను సరిచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మోటె ధర్మారావు, దానవేన రాములు, విద్యుత్ ఏఈ శంకర్, రఘు, రాము లు, కిరణ్, ఇంద్రసేన, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.