ములుగు టౌన్, జనవరి 3: శాఖల వారీగా గ్రీవెన్స్‌లో వ చ్చిన ప్రజల సమస్యలపై జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ ప్రజల వినతులను స్వీకరించి అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆయా శాఖల అధికారులు త్వరగా పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. గొత్తి కోయ పిల్లను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గేర్తు చేశారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో అప్పయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, ఎల్డీఎం ఆంజనేయులు, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీపీవో వెంకయ్య, డీవీహెచ్‌వో డా క్టర్ విజయభాస్కర్ రెడ్డి, డీసీవో సర్దార్ సింగ్, డీసీడబ్ల్యూ డీవో భాగ్యలక్ష్మి , డీడబ్ల్యూవో ప్రేమలత పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి :కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంను నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యల పై వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పై ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.