సీఎం కేసీఆర్ విజన్ ఉన్న వ్యక్తి
మన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శం
ప్రతిపక్ష నాయకుల మాటలను తిప్పికొట్టాలి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
రాంచంద్రాపురంలో సీసీ రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం
సంగెం, జనవరి 2 : దళితబంధును ఆపే శక్తి ఎవరికీ లేదని, ఏప్రిల్ నుంచి నియోజకవర్గంలో ప్రారంభిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మండలంలోని రాంచంద్రాపురంలో ఆదివారం రూ.కోటి 69లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో ఎం సంపత్‌రావుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. గ్రామ మొదటి సర్పంచ్ బోంపెల్లి లక్ష్మీకాంతారావు స్మారకార్థం వారి కుమారుడు, కోడలు ప్రస్తుత సర్పంచ్ బోంపెల్లి జయశ్రీదిలీప్రావు వైకుంఠ రథాన్ని గ్రామానికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎంగా కేసీఆర్ పదికాలాల పాటు ఉంటేనే రాష్ర్టాభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని, దీన్ని చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈ నెల నుంచే కొత్త పింఛన్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ చిదిరాల రజిత, తహసీల్దార్ రాజేంద్రనాథ్, పీఆర్ ఏఈ రమేశ్, నరహరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, సొసైటీ చైర్మన్లు కుమారస్వామియాదవ్, దొమ్మాటి సంపత్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ గుగులోత్ వీరమ్మ, దోపతి సమమ్మయ్యయాదవ్, కిషన్, కత్రి రమేశ్, కృష్ణంరాజు, కిశోర్‌యాదవ్, గోపిసింగ్, దొనికెల శ్రీనివాస్, ఉండీల రాజు తదితరులు పాల్గొన్నారు.