KCR Birthday | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేవరకొండ పట్టణంలో..
దేవరకొండ, ( చందంపేట ), ఫిబ్రవరి 17 : మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు అని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. కాంగ్రెస్ మోసాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు . ఈ కార్యక్రమం లొ జిల్లా నాయకులు గాజుల ఆంజనేయులు, బిల్య్ నాయక్, రమేష్ నాయక్, రూపుల నాయక్, రవి, శ్రీనివాస్ గౌడ్, సుభాష్ గౌడ్, రాజు, కృష్ణ,హరి లాల్, మధు, మురళి, జానీ బాబా పటేల్ పాల్గొన్నారు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో..

చౌటుప్పల్, ఫిబ్రవరి 17 : చౌటుప్పల్ మున్సిపాలిటీపరిధిలోని తంగడపల్లి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మాజీ సర్పంచ్ దయాకరాచారి ఆధ్వర్యంలో మాజీ సీఎం కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం నిండు నూరేళ్లు కేసీఆర్ జీవించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, గడ్డం ఇందిర రాజరత్నం, ఊదరి యాదయ్య, నాయకులు బొప్పిడి రఘునందన్ రెడ్డి, రాగిరు సత్యనారాయణ, ఊదరి కిషోర్, రావుల ముత్యాలు, బొడ్డు ముత్యం గౌడ్, ఊదరి మహేష్, నూతి శివ, జిట్ట కృష్ణ, ఎండి అస్లాం, ఉదరి శ్యాంసుందర్ కొమ్మగొని కిషోర్, కేతరాజు శేఖర్ కొయ్యడ లింగస్వామి, నిమ్మల అచ్చయ్య, బొల్లమోని శ్రీకాంత్, కానుగు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చండూరులో కేసీఆర్ బర్త్ డే..

చండూరు ఫిబ్రవరి 17: చండూరు మండలం, మున్సిపాలిటీలో ఘనంగా కేసీఆర్ జన్మదిన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో తెలంగాణ మంగళవారం తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. చండూరు పట్టణం కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చేసిన త్యాగాలు, నిరంతర పోరాటం, అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన దూరదృష్టి నాయకత్వం గురించి పలువురు నేతలు ప్రస్తావించారు. పేదల సంక్షేమం, రైతు బీమా , రైతుబంధు,పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక కార్యక్రమాలు రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేక స్థానంలో నిలిపాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, చండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్ , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రామగిరి సుభాష్, మహిళా మండల అధ్యక్షురాలు పెండ్యాల గీత, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, సామ సుజాత, కొండ్రెడ్డి మధు, సర్పంచులు నారపాక వసంత ధనయ్య, గాలింక రాంబాబు, దామర రాములు,మాజీ కౌన్సిలర్లు అనపర్తి శేఖర్, గుంటి వెంకటేశం, తేలుకుంట్ల జానయ్య, తేలుకుంట్ల చంద్రశేఖర్, కాసాల యాదగిరి రెడ్డి,నందికొండ నర్సిరెడ్డి, నారపాక శంకర్, చిలువేరు నరేష్, చొప్పరి దశరథ, బేరి చంద్రశేఖర్, కళ్లెం సైదులు రెడ్డి,గండూరి జనార్ధన్, జోర్రిగల వెంకన్న, బోడ శ్రీకాంత్, రాపోలు జగదీష్, భూతరాజు గిరి,బోడ శ్రీకాంత్, ఇడికూడా నాగరాజు, బూతు రాజు వెంకన్న, సామ యాదవ రెడ్డి, తాడిశెట్టి సంతోష్ ,మహమ్మద్ గౌస్, కామిశెట్టి ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, బోయపల్లి దశరథ, సూరం శ్రీనివాస్ రెడ్డి, దొంతగోని వెంకన్న, బొమ్మరబోయిన రమేష్, దోటి శ్రీను,బోడ మోహన్, ఇరిగి దుర్గాప్రసాద్, ఇరిగి రామకృష్ణ, తాందర్ రవి, కావలి పెద్ద యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో..

నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్ట్, చెరుకు సుధాకర్ భారీ సంఖ్యలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.