లక్నవరంలో పర్యాటకుల సందడి
గోవిందరావుపేట, జనవరి 1 : ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు శనివారం రద్దీగా మారాయి. ఆంగ్ల సంవత్సరాది హాలీ డే కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఎంజాయ్ చేశారు. గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. సరస్సులో బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు. యువతీ, యువకులు జిప్ సైక్లింగ్‌పై ప్రయాణించేందుకు పోటీ పడ్డారు. కాగా, నూతన సంవత్సర వేడుకలను లక్నవరం సరస్సు వద్ద పర్యాటకులు జరుపుకున్నారు. మొదటి, రెండు, మూడు ఐలాండ్లలో బస చేసిన పర్యాటకులు నైట్ కాంపేన్లో చలిమంటలు కాగుతూ సంబురాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 12గంటలకు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శుక్రవారం రాత్రి పర్యాటకులతో విద్యుత్ వెలుగుల నడుమ లక్నవరం కిక్కిరిపోయింది.