
వరంగల్, సెప్టెంబర్ 01 : చారిత్రక వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇన్షియేటివ్, అలయెన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిర్మూలన ప్రాజెక్ట్‌కు ఎంపికైన రెండు నగరాల్లో ఒకటి వరంగల్ కావడం సంతోషకరమన్నారు. కేంద్రానికి అన్ని ధ్రువీకరణ పత్రాలు అందజేసి ఎంపిక కోసం కృషి చేసిన ప్రజారోగ్య విభాగాన్ని అభినందించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ప్లాస్టిక్ శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు సి బ్బంది కృషి చేయాలన్నారు.
ఇందుకు కార్పొరేషన్ సహకారం అందిస్తుందన్నారు. సంస్థ ప్రతినిధి సంస్కృతి మాట్లాడుతూ.. అలయెన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ (ఏఈపీడబ్ల్యు) ద్వారా ప్రాజెక్ట్‌కు నిధులు సమకూరుతాయన్నారు. వివరణాత్మక సర్వేలు, వ్యర్థాల వర్గీకరణ, ప్ర మాణీకరణ ఆధారంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వ్యూహం ఉండాలన్నారు. వ్యూహం అ మలు, ప్రాజెక్ట్ నిర్వహణ బల్దియా ఆధ్వర్యం లో జరుగుతుందన్నారు. ప్రాజెక్ట్‌ను ఆరు నెల ల్లో గుర్తించి నిధులు మంజూరు చేస్తారన్నారు. అదనపు కమిషనర్ నాగేశ్వర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌వో కిశోర్, అలయెన్స్ సంస్థ ప్రతినిధి రాహుల్, శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్, డిజిటల్ ఇంజినీర్ ఆడెపు సురేశ్ పాల్గొన్నారు.